Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిసెంబర్ 31 వరకు అవకాశం ఇవ్వండి..

డిసెంబర్ 31 వరకు అవకాశం ఇవ్వండి..

- Advertisement -

రాష్ట్ర రైస్ మిల్లర్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
మాజీ అధ్యక్షులు నాగేందర్, సెక్రటరీ మోహన్ రెడ్డి
– 33 జిల్లాల కార్యవర్గ సభ్యులతో సమావేశం 
నవతెలంగాణ – సిద్ధిపేట 

2014 నుండి 24 వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులకు 9 కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం ఇవ్వగా, 9 కోట్ల 60 లక్షల టన్నుల కు సంబంధించిన బియ్యంను ప్రభుత్వానికి అందజేశామని, కేవలం 10 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని మాత్రమే ఇవ్వాలని, డిసెంబర్ 31 వరకు అవకాశం ఇస్తే బియ్యం మొత్తం ప్రభుత్వానికి అప్పగిస్తామని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అండ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నాగేందర్, సెక్రటరీ మోహన్ రెడ్డిలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం పట్టణంలోని వి ఎస్ ఎస్ ఫంక్షన్ హాల్  33 జిల్లాల కార్యవర్గ సభ్యులతో జిల్లా అర్బన్, రూరల్ సంఘాల అధ్యక్షులు చింత రాజు, చంద్రశేఖర్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారులు అవలంబిస్తున్న విధానాలకు బాధగా  రైస్ మిల్లులను బందు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రైస్ మిల్లులను ఫిజికల్ గా తనిఖీలు చేస్తూ  ఇబ్బందుల గురి చేస్తున్నారని, డిసెంబర్ 31 వరకు అవకాశం ఇస్తే తమ వద్ద ఉన్న ధాన్యాన్ని మొత్తం అప్పగించిన తర్వాతనే కొత్త ధాన్యాన్ని తీసుకుంటామని అన్నారు. గతంలో ఏ సీజన్ కు సంబంధించిన బియ్యాన్ని ఆ సీజన్లోనే డెలివరీ చేసేవారమని, కానీ గత మూడు సంవత్సరాల నుండి ఎఫ్సిఐ వారు స్థలం చూపెట్టకపోవడంతో బియ్యాన్ని డెలివరీ చేయలేకపోతున్నామని, దానివలన మిల్లర్లను డిఫాల్టర్లుగా చిత్రీకరించి 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ విధించడం సరికాదన్నారు.

2025 – 26 రబీ సీజనుకు సంబంధించి బాయిల్డ్ రైస్ వద్దు, రా రైస్ మాత్రమే ఇవ్వాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఆ వడ్లను రా రైస్ గా మారిస్తే పెద్ద మొత్తంలో బియ్యం రావని అన్నారు. ప్రభుత్వం సుమారు 900 కోట్ల మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్, ఇతర చార్జీలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో మిల్లర్లు అందరూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంతమంది రైస్ మిల్లర్లు తప్పు చేస్తే వారిని శిక్షించాలని, అలాంటివారిని తమ సంఘం కూడా క్షమించదని అన్నారు. 

గత కొన్ని రోజులుగా సివిల్ సప్లై, విజిలెన్స్, ఇంటలిజెన్స్ వారు మిల్లులను తనిఖీ చేస్తూ, ధాన్యం షార్ట్ ఫాల్ ఉన్నదని కేసులు పెడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 100 మందిపై కేసులు పెట్టారని అన్నారు. మిల్లర్లు ఎలాంటి అవకతవకలు చేయలేదని, ధాన్యాన్ని బియ్యం గా మారుస్తున్నప్పుడు షాట్ పాల్ అవుతుందని అన్నారు. ఎఫ్ సి ఐ కఠినమైన నిబంధనలను కొంతమేర సడలించాలని, మిల్లర్లతో ప్రభుత్వం చర్చలు జరపాలని, రైస్ మిల్లులను వ్యవసాయ అనుబంధ సంస్థలుగా గుర్తించాలని కోరారు. ప్రభుత్వం కొత్తగా ఎస్ఓపి యాప్ ను తెచ్చిందని, అధికారులు రైస్ మిల్లులకు వచ్చి ధాన్యాన్ని లెక్కించి ఆ యాప్ లో అప్లోడ్ చేయనున్నట్లు తెలిపారు. అధికారులకు, ప్రభుత్వానికి తాము సహకరిస్తామని అన్నారు. తమ సమస్యల పరిష్కరించాలని బందు చేస్తున్నామని, తొమ్మిది రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలను చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన నాయకులు  కాశీనాథ్, బుచ్చయ్య, బాలకిషన్, విష్ణుమూర్తి, శివకుమార్, కిషోర్, ప్రభాకర్ రావు, నారాయణ, వెంకన్న, శ్రవణ్ కుమార్, యాదగిరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -