Saturday, September 12, 2026
E-PAPER
Homeజిల్లాలుఉద్యమ చరిత్రలో ఏచూరిది ఒక ప్రత్యేక అధ్యాయం

ఉద్యమ చరిత్రలో ఏచూరిది ఒక ప్రత్యేక అధ్యాయం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కామ్రేడ్‌ సీతారాం ఏచూరి ఒక ప్రత్యేక అధ్యాయమని సీపీఐ(ఎం) నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎల్‌. దేశనాయక్ అన్నారు. ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలో శనివారం సీపీఐ(ఎం) గ్రామశాఖ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నాయకుడిగా, మార్క్సిస్టు సిద్ధాంతవేత్తగా, పార్లమెంటేరియన్‌గా, రచయితగా, విద్యార్థి ఉద్యమకారుడిగా, లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సిద్ధాంతం, పోరాటం, ప్రజాస్వామ్యం, లౌకికత కోసం జీవితాంతం అంకితమైన నాయకుడని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక భారతదేశాన్ని పరిరక్షించడంతో పాటు దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల ఐక్యతను బలోపేతం చేసిన గొప్ప నాయకుడని వర్ణించారు. సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -