నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇరు పక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న కోర్టు నివేదిక తయారుచేసే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సభర్వాల్, ఎస్.కె.జోషిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది.
కేసీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



