Wednesday, April 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహ‌ర్మూజ్ గుండా రాక‌పోక‌ల కోసం బ్రిట‌న్, ఫ్రాన్స్ స‌న్నాహాలు

హ‌ర్మూజ్ గుండా రాక‌పోక‌ల కోసం బ్రిట‌న్, ఫ్రాన్స్ స‌న్నాహాలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: అమెరికా క‌వ్వింపుల చ‌ర్య‌ల‌తో ప‌శ్చిమాసియాలో హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని ఇరాన్ మూసివేసిన విష‌యం తెలిసిందే. నెల‌ల త‌ర‌బ‌డి యుద్ధం కార‌ణంగా చ‌మురు ర‌వాణా నిలిచిపోయి ప్ర‌పంచంలో ఇంధ‌న సంక్షోభానికి దారితీసింది. ఇరాన్‌కు సంబంధించిన పోర్టుల‌పై యూఎస్ దిగ్భందం విధించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈక్ర‌మంలోనే హ‌ర్మూజ్ గుండా చ‌మురు నౌక‌ల‌ రాక‌పోక‌లు స‌హ‌జ‌వుగా సాగేందుకు ఫ్రాన్స్‌, బ్రిట‌న్ క‌లిసి ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించిన స‌న్నాహాలు మొద‌లు పెట్టింది.

30కి పైగా దేశాలకు చెందిన సైనిక నిపుణులు ఉత్తర లండన్‌లోని నార్త్‌వుడ్‌లో ఉన్న యూకే శాశ్వత సంయుక్త ప్రధాన కార్యాలయంలో బుధ‌వారం నుంచి రెండు రోజులు స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక సమన్వయ ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు యూకే, ఫ్రాన్స్‌ల నేతృత్వంలో ప్ర‌య‌త్నం పేర్కొంది. యూకే-ఫ్రాన్స్ నాయకత్వంలో సుస్థిరమైన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, పరిస్థితులు అనుమతించిన వెంటనే జలసంధిని తిరిగి తెరవడానికి అవసరమైన సైనిక ప్రణాళికలను ఈ సమావేశాలు ముందుకు తీసుకువెళ్తాయ‌ని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గత వారం పారిస్‌లో యూకే, ఫ్రాన్స్ ఆధ్వర్యంలో.. 51 దేశాల ప్రతినిధులను మ‌ధ్య అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశంతో ఈ చొరవ తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -