- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేపాల్‌లో బాలెన్ షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా గడవకముందే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. హోంమంత్రి సుదన్ గురుంగ్ అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేకత మధ్య బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిష్పాక్షిక విచారణకు సహకరించేందుకే రాజీనామా చేస్తున్నట్లు గురుంగ్ ప్రకటించారు.
- Advertisement -



