Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్టీసీ సమ్మె.. బస్సులు లేక ప్రయాణికుల వెతలు

ఆర్టీసీ సమ్మె.. బస్సులు లేక ప్రయాణికుల వెతలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఆర్టీసీ పరిరక్షణతో పాటు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. కార్మికులు సమ్మెలోకి దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపోల ఎదుట కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మద్నూర్ మండల పరిధిలోని ప్రయాణికులు బస్సులు అందుబాటలో లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోపైపు ప్రయివేటు వాహనాలు (ఆటోలు, కార్లు) ఇదే అదునుగా భావించి, అధిక రేట్లతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలు రాష్ర్టమంతా ఉచితంగా ప్రయాణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అత్యవసరాలకు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లాలంటే డబ్బులు పెట్టి, ఎండలో వేచి నిలబడి మరీ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సమ్మె విరమింపజేసి, బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని మండల ప్రజలు కోరుతున్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -