Wednesday, April 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా లెనిన్ 156వ జయంతి వేడుకలు 

ఘనంగా లెనిన్ 156వ జయంతి వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో కమలానగర్ కార్యాలయంలో ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు వ్లాదిమిర్ ఇల్యిచ్ లెనిన్ 156వ జయంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోమటి రవి, సీనియర్ నాయకురాలు శారద లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బాధ్యులు సిహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ, కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజాన్ని లెనిన్ అభివృద్ధి చేసి, పెట్టుబడిదారీ విధానాల అత్యున్నత దశ సామ్రాజ్యవాదమని సూత్రీకరించారని పేర్కొన్నారు. సోషలిజం నిర్మాణం ఒక దేశంలో సాధ్యమని ఆయన ఆచరణలో చూపించారని అన్నారు. కోమటి రవి మాట్లాడుతూ మార్క్సిజం–లెనినిజం సమాజ మార్పుకు మార్గదర్శకమైన సజీవ సిద్ధాంతాలని తెలిపారు. 

అనేక నిర్బంధాలను ఎదుర్కొని సోవియట్ యూనియన్ స్థాపనలో లెనిన్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన సిద్ధాంతాలను భారత పరిస్థితులకు అన్వయించుకుని పోరాటాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రీమన్నారాయణ, రుక్కయ్య, సోమయ్య, శారద తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులందరూ లెనిన్ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమం లో కేకే ఉన్నికృష్ణన్, ఎన్ శ్రీనివాస్, సుధీర్, వెంకటేశ్వరరావు, సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -