- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని జగదాంబ తండ గ్రామపంచాయతీ పరిధిలో లో వోల్టేజి సమస్యను తీర్చడానికి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసిన విద్యుత్ సిబ్బందికి బుధవారం గ్రామపంచాయతీ పాలకవర్గం తరపున శాలువాలతో సన్మానించారు. భవిష్యత్తులో ఇలాంటి సహకారం అందించాలని విద్యుత్ సిబ్బందికి గ్రామపంచాయతీ పాలకవర్గం కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య లతా బాయ్ నంద, ఉపసర్పంచ్ పూర్ణ రాజు నాయక్, పాలకవర్గ సభ్యులు, విద్యుత్ సిబ్బంది, తాండ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



