Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరో స్వచ్ఛమైన ప్రేమకథ

మరో స్వచ్ఛమైన ప్రేమకథ

- Advertisement -

కె. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘తెలుసా తెలుసా’ అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ఈ పాటకు సురేష్ బనిశెట్టి సాహిత్యం.. అనుదీప్ దేవ్, లిప్సిక గాత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మెలోడీ ట్యూన్‌ను మనసుని హత్తుకునేలా ఉంది. లిరికల్ వీడియో ఎంతో అందంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్ల జంట.. వారిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ పాటకు అదనపపు ఆకర్షణ కానున్నాయి. హర్ష్ రోషన్, నక్షత్ర, దీపక్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడు: విజయ్ బుల్గానిన్, డీఓపీ: కె.వి.గుహన్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్, ప్రొడక్షన్ డిజైన్: చిన్నా, కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి, సాహిత్యం: సురేష్ బనిశెట్టి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -