Sunday, September 13, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏచూరి జీవితం శ్రామిక లోకానికి మార్గదర్శకం

ఏచూరి జీవితం శ్రామిక లోకానికి మార్గదర్శకం

- Advertisement -

ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్దాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ ‌వెస్లీ
ప్రపంచం గర్వించదగిన మార్క్సిస్టు మేధావి సీతారాం : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం
రాష్ట్ర వ్యాప్తంగా ఏచూరి రెండో వర్థంతి.. ఘన నివాళులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌/కొత్తగూడెం/
సంగారెడ్డి/వనపర్తి/మిర్యాలగూడటౌన్/భువనగిరి
సీతారాం ఏచూరి జీవితం యావత్ శ్రామిక లోకానికి మార్గదర్శకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు. శనివారం హైదరా బాద్‌‌లోని ఎంబీభవన్‌లో కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి అధ్యక్షతన ఏచూరి రెండో వర్థంతి సభను నిర్వహిం చారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ కాకినాడలో జన్మించి, హైదరాబాద్, ఢిల్లీలో విద్యనభ్యసించి, దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఏచూరి ఎదిగారని గుర్తు చేశారు. ఆయన లేని లోటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. రాజ్య సభలో ప్రజల గొంతుకగా నిలిచి శ్రామిక వర్గాల హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీసిన ధీశాలి ఏచూరి అని ‌కొనియాడారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్ దోపిడీ పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో లౌకిక శక్తుల ఐక్యత కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని వివరించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుసరి స్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేదరికం, నిరుద్యోగం, కుల-మత అసమానతలు పెరిగిపో తున్నాయని చెప్పారు.

ప్రజల ఓటు హక్కును సైతం బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని తెలిపారు. ఏచూరి ఆశయ సాధన కోసం శ్రామిక వర్గాలు, అణగారిన తరగతులు ఐక్యంగా పోరాటాలను ఉధృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ ఏచూరి అడుగుజాడల్లో దేశ లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాల న్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రస్తుత రాజకీయాల్లో ఎంతైనా అవసరమని పేర్కొన్నా రు. బీజేపీ అనుస రిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడానికి ఏచూరి చూపిన మార్గమే మనకు మార్గం అని స్పష్టం చేస్తూ, ఆయనకు ఘన నివాళులు అర్పిం చారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె బాబూరావు, బి ప్రసాద్, ప్రజారంగాల నాయకులు పాల్గొన్నారు.

ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన గొంతుక : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు 
తమ్మినేని వీరభద్రం
‘‘ప్రపంచం గర్వించదగిన మార్క్సిస్టు మేధావి ఏచూరి అని.. ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిన ప్రతిసారీ ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన గొంతుక, లౌకికవాదంపై దాడి జరిగిన ప్రతిసారీ గట్టిగా ప్రతిఘటించిన స్వరం ఏచూరి’’ అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏచూరి వర్ధంతి సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నివాళుల ర్పించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కమ్మ సేవా కళ్యాణ మండపంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం, బండారు రవికుమార్ పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. మార్క్సిజాన్ని కేవలం అధ్యయనం చేయడమే కాకుండా ఆ సిద్ధాంతాన్ని ప్రజా జీవితంలో ఆచరణలోకి తీసుకొచ్చిన దార్శనికుడు ఏచూరి అని కొనియాడారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడారు.

ఆదర్శనేత ఏచూరి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
చివరి శ్వాస వరకు పీడిత వర్గాల గొంతుకగా నిలిచిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి అని, రాజకీయాల్లో లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేయడంలో ఆయన చేసిన పాత్ర కీలకమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సీపీఐ(ఎం) సంగారెడ్డి కార్యాలయంలో ఏచూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

విప్లవోద్యమాలకు మార్గదర్శకులు : సీపీఐ(ఎం) 
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
ప్రపంచ దేశాల్లోని విప్లవోద్యమాలకు ఏచూరి మార్గదర్శకులుగా పనిచేశారని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాల గూడ, వనపర్తి జిల్లా కేంద్రంలో ఏచూరి వర్ధంతి సభల్లో ఆయన పాల్గొన్నారు.

​దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర మరువ లేనిది : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్
దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి పాత్ర మరువ లేనిదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్ అన్నారు. యాదాధ్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.​

పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర పూర్వ కార్యదర్శి 
టి. సాగర్​
విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు దేశంలోని విద్యార్థులు, యువజనులు, కార్మికులు, కర్షకులు, పేదలు, పీడిత వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పోరాట యోధుడు ఎస్‌ఎఫ్‌ఐ పూర్వ అఖిల భారత అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఏచూరి అని ఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి ఏపీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ కొనియాడారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని సీఐటీయూ సిటీ కార్యాలయంలో శనివారం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్ అధ్యక్షతన ఏచూరి వర్థంతి సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర కమిటీ సభ్యు లు, వివిధ జిల్లాల నాయకులు ఏచూరి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్య దర్శి టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. కిరణ్, కె. శంకర్, ఎం. మమత, అశోక్ రెడ్డి, సహాయ కార్యదర్శులు దీపిక, తారా సింగ్, కార్తీక్‌తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, అవినాష్, లెనిన్ గువేరా, అరవింద్, జ్ఞాపిక పాల్గొన్నారు.​

వర్గ, సామాజిక ఉద్యమాలను ఉధృతం చేయాలి :​
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
వర్గ, సామాజిక ఉద్యమాలను ఉధృతం చేయటమే సీతారాం ఏచూరికి నిజమైన నివాళి అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. శనివారం హైదరా బాద్‌‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఉపాధ్యక్షులు వీఎస్‌ ‌రావు అధ్యక్షతన ఏచూరి వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి చిత్రపటానికి భాస్కర్‌, ఎస్వీ రమ పూలమాలలేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె. మల్లిఖార్జున్, కె. ఈశ్వర్‌‌రావు, పి. జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, వి. సుధాకర్, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై. సోమన్న, రొయ్యల రాజు, ఎ. సునీత, ఎస్ఎస్ఆర్ఎ. ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -