నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో రానున్న విద్యా సంవత్సరానికి బుధవారం డిజిటల్ తరగతి గదిని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మన్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు గీత మాట్లాడారు. విద్యలో సాంకేతికత, విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించేందుకు దోహదపడుతుందన్నారు. డిజిటల్ తరగతి గదితో పాటు లైబ్రరీ, ప్లే మెటీరియల్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, వెల్ పర్నిష్డ్ క్లాస్ రూమ్స్ నాణ్యమైన బోధన, వినూత్న కార్యక్రమాలు అన్నింటిలో ముందంజలో ఉన్న ఎస్సీ కాలనీ పాఠశాల రానున్న విద్యా సంవత్సరంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు సహకరించాలని తల్లిదండ్రులను కోరారు.
పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరు పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఏఏపిసి చైర్మన్ సరిత, సిఆర్పీ సమత, ఉపాధ్యాయులు అరుణ్ కుమార్, సురేష్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



