నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం రామన్నపేట్ గ్రామ పంచాయతీకి స్థానిక ఫ్రెండ్స్ యూత్ సభ్యులు బాడీ ఫ్రీజర్ ను విరాళంగా అందజేశారు. ఈ మేరకు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బాడీ ఫ్రీజర్ ను ఫ్రెండ్స్ యూత్ సభ్యులు సర్పంచ్ బేల్దారి నవీన్ కు అప్పగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటి వరకు బాడీ ఫ్రీజర్ లేకపోవడంతో పలు సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. ఫ్రెండ్స్ యూత్ సభ్యుల ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలోని ఇతర యువజన సంఘాలు ముందుకు వచ్చి గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి ఫర్నిచర్, పుస్తకాలు, ర్యాకులు అందించాలని కోరారు. అనంతరం బాడీ ఫ్రీజర్ ను విరాళంగా అందించిన ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులను సర్పంచ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బాడీ ఫ్రీజర్ విరాళంగా అందించిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



