Sunday, September 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగణేష్‌ ఉత్సవాల సమన్వయంపై దృష్టి

గణేష్‌ ఉత్సవాల సమన్వయంపై దృష్టి

- Advertisement -

ప్రత్యేక అధికారుల నియామకం
నిర్వాహకులు కచ్చితంగా అనుమతులు తీసుకోవాల్సిందే
అప్పుడే బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ సాధ్యం
సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‌గణేష్‌ ఉత్సవాల పర్యవేక్షణకు, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. మండపాలకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవడం వల్ల రవాణా నియంత్రణ, బందోబస్తు వంటి విషయాల్లో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. అందుకోసం ప్రతి ఒక్క నిర్వహకుడూ మండపాలకు తప్పసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. శనివారం అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌‌లో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు, పోలీస్ ఉన్నతాధికారులు, అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామన్నారు. సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రిగా సమీక్షిస్తున్నట్తు తెలిపారు. మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలను స్థానిక కమిషనరేట్‌‌కు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఊహించని పరిణామాలు జరగినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గణేష్‌ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తు‌న్నట్టు తెలిపారు.మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని సూచించారు. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చెరువుల వద్ద చుట్టూ క్రేన్లు ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -