Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయంవ్యూహాత్మక ఒప్పందాలను కొనసాగిద్దాం

వ్యూహాత్మక ఒప్పందాలను కొనసాగిద్దాం

- Advertisement -

భారత్‌కు పెజెష్కియాన్‌ సూచన
న్యూఢిల్లీ
: వ్యూహాత్మక ఒప్పందాలను కొనసాగించాలని ఇరాన్‌ అధ్యక్షఁడు పెజెష్కియాన్‌ భారత్‌కు సూచించారు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం న్యూఢిల్లీ చేరుకున్న పెజెష్కియాన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సాదర పూర్వక స్వాగతం పలికారు. ఇరాన్‌ అధ్యక్ష‍ుడిగా ఎన్నికైన రెండేండ్ల తర్వాత పెజెష్కియాన్‌ తొలిసారి మన దేశానికి వచ్చారు. అనంతరం మోడీతో సమావేశమయ్యారు. రెండు వారాల వ్యవధిలో వీరిద్దరూ కలుసుకోవడం ఇది రెండోసారి. గత నెల 31న బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇరాన్‌తో వివిధ రంగాలలో వాణిజ్యాన్ని విస్తరించాలని ఆ సమయంలో మోడీ సూచించారు. కాగా ప్రొటోకాల్‌ ప్రకారం ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ మంత్రి శాంతను ఠాకూర్‌ విమానాశ్రయంలో పెజెష్కియాన్‌కు స్వాగతం పలికారు. పెజెష్కియాన్‌ను కలిసిన అనంతరం మోడీ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెడుతూ ‘బిష్కెక్‌ నుంచి ఢిల్లీ వరకూ మా మధ్య ఫలప్రదమైన చర్చలు కొనసాగాయి. పెజెష్కియాన్‌ను కలవడం సంతోషంగా ఉంది. ఆయన భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం వల్ల ఈ పర్యటన మరింత ప్రత్యేకమైనది’ అని రాశారు. భారత్‌, ఇరాన్‌ మధ్య స్నేహసంబంధాల గురించి చర్చించామని, దీర్ఘకాలిక, పరస్పర ప్రయోజనకరమైన వ్యూహంతో ముందుకు సాగాలని అనుకుంటున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు కూడా తమ మధ్య జరిగిన సంభాషణలో చర్చకు వచ్చాయని అంటూ అక్కడ శాంతి స్థాపన జరగాలన్న విషయంలో తమ వైఖరి దృఢంగా ఉన్నదని మోడీ వివరించారు.

‘మాకు ప్రాంతీయ పోలీసు’ అవసరం లేదు మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్
హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరు దేశాలు యుద్ధంలో పోటీ పడుతున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యానికి ‘ప్రాంతీయ పోలీసు’గా అమెరికా అవసరం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పష్టంచేశారు. భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో సమావేశమైనప్పుడు, ‘‘మాకు ప్రాంతీయ పోలీసు అవసరం లేదు’’అని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రాదేశిక సమగ్రత , భద్రతకు దానిలోని ప్రధాన భాగస్వాములు.. అందులో భాగమైన దేశాలు మాత్రమే హామీ ఇవ్వగలవు’’ అని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నాయకుడు మరణించినప్పటి నుంచి ఇరాన్ పై ట్రంప్, నెతన్యాహు తెగబడుతూనే ఉన్నారు. టెహ్రాన్ కూడా ఏమాత్రం తగ్గటంలేదు. దీటుగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతూనే ఉన్నది. ‘‘మా ప్రజలు ఎన్నో అన్యాయాలకు గురైనప్పటికీ, మేము యుద్ధాన్ని గానీ, దాని కొనసాగింపును గానీ కోరుకోవడం లేదు. శాంతే మా ప్రాధాన్యత’’ అని పెజెష్కియన్ అన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇరాన్ అధ్యక్షుడు మర్యాద పూర్వకంగా కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -