నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సుంకపాక మనోజ్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ నిలబెట్టక పోవడంతోనే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకి దిగాయని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అందులో భాగంగా ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. హామీ ఇచ్చి దాదాపు రెండున్నర సవంత్సరాలు ప్రభుత్వంలో చలనం లేకపోవడం, హామీలు అమలు కాకపోవడంతోనే ఆర్టీసీ సమ్మె ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
సమ్మె వల్ల నష్టపోయేది మధ్య తరగతి ప్రజలేనని, సమ్మె వలన ఇప్పుడు ప్రైవేట్ వాహన యాజమాన్యం ఇష్టం వచ్చిన విధంగా డబ్బులు వసూల్ చేస్తారని, దీని వలన ములిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు రాష్ట్రంలో ప్రజల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రైవేట్ దోపిడీ తట్టుకునే శక్తి ప్రజల్లో లేదని అన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల మా పై ఒత్తిడి పెరిగిందని మునపటి లా ప్రశాంతంగా ఉండలేక పోతున్నామని కొందరు డ్రైవర్లు చెబుతున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు పెట్టి పురుషుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కు ప్రజలు ఘోరి కట్టే రోజు దగ్గర్లో ఉందని అన్నారు. సమావేశంలో సీనియర్ నాయకులు రాజు, వరుణ్, సికిందరు, సాయి, వేణు, విష్ణు పాల్గొన్నారు.



