Thursday, April 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబ్రాండ్‌ ఆధారంగా ప్రాధాన్యత

బ్రాండ్‌ ఆధారంగా ప్రాధాన్యత

- Advertisement -

మూడు కేటగిరీలుగా విభజించండి : పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు, సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సీఎం ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వాటిలో పేరున్న బ్రాండ్‌ సంస్థలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న అన్ని సంస్థలనూ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలనీ, వారితో తరచుగా మాట్లాడు తూ అనుమతులు, భూ కేటాయింపుల అంశాల్లో అవసరమైన ప్రతిపాదనలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. బుధవారం సీఎం నివాసంలో పరిశ్రమలశాఖపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికా రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై సీఎం రేవంత్‌రెడ్డికి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. వివిధ వేదికలపై ప్రభుత్వంతోఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు తమ కార్యకలాపాలు మొదలు పెట్టేలా చూడాలని సీఎం ఆదేశించారు. దానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని దిశానిర్దేశం చేశారు. పెట్టుబడులకు సంబంధించి దావోస్‌, తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో జరిగిన పారిశ్రామిక ఒప్పందాలు, వాటి పురోగతిపై చర్చించారు. ఒప్పందాల ప్రకారం ఇప్పటి వరకు గ్రౌండ్‌ అయిన కంపెనీలు, పెండింగ్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫ్యూచర్‌ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలపైనా సమీక్ష నిర్వహించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్‌ అవసరాలకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌ (ఎస్టీపీ) ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -