Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీపెక్‌ సర్వే దేశానికి ఆదర్శం

సీపెక్‌ సర్వే దేశానికి ఆదర్శం

- Advertisement -

– 42 ప్రమాణాలతో 75 అంశాల సమాచారాన్ని సేకరించాం : ఇండిపెండెట్‌ ఎక్స్‌ పర్ట్‌ కమిటీ గ్రూప్‌ వైస్‌ చైర్మెన్‌ కంచ ఐలయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్‌) దేశానికి ఆదర్శమని ఇండిపెండెట్‌ ఎక్స్‌్‌పర్ట్‌ కమిటీ గ్రూప్‌ వైస్‌ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య అన్నారు. సభ్యులు ప్రవీణ్‌ చక్రవర్తి, భాగ్య బుక్యలతో కలిసి బుదవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపెక్‌ సర్వేపై చేసిన అధ్యయనాన్ని వివరించారు. మండల్‌ కమిషన్‌ 11 ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేయగా, సీపెక్‌ సర్వే మాత్రం 3.55 కోట్ల మంది ప్రజల వద్ద 42 ప్రమాణాలతో 75 అంశాల సమాచారాన్ని సేకరించామని తెలిపారు 10 లక్షల జనాభాకు పై బడిన కులాలు 10 ఉండగా, 20 కులాలు మొత్తం జనాభాలో 75 శాతం ఉన్నాయనీ, 56 కులాలు 90 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఓసీలతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు మూడు రెట్లు వెనకబడ్డారని అన్నారు. ఉద్యోగ అసమానతలు ఎస్సీ, ఎస్టీల్లో అధికంగా ఉన్నాయన్నారు. సాధారణ కులాల్లో కేవలం 10 శాతం మంది మాత్రమే రోజువారీ కూలీలుగా పనిచేస్తుండగా, షెడ్యూల్డ్‌ కులాలు, తెగలో దాదాపు 50 శాతం మంది రోజువారీ కూలీలుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర సగటుతో పోలిస్తే 99శాతం ఎస్టీలు, 97 శాతం ఎస్సీలు వెనుకబడినవారని అన్నారు. తెలంగాణలోని ప్రజల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనానికి జీవన పరిస్థితుల మధ్య ఉన్న అంతరాలను సర్వే స్పష్టం చేసిందన్నారు. అత్యంత దిగువ స్థాయిలో ఎస్టీ కొలాం సమాజంలోని 64.7 శాతం కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం లేదన్నారు. ఇది రాష్ట్ర సగటు కంటే మూడు రెట్లకు పైగా ఉందన్నారు. అయితే విద్యుత్‌ కొరత అన్ని వర్గాల్లో ఒకేలా లేదని చెప్పారు. కొన్ని వర్గాల్లో ఈ అంతరాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారు, ఇప్పటికీ ఇరుకైన చిన్న చిన్న ఇండ్లలో నివసిస్తున్నారని తెలిపారు. 75 శాతం ఎస్టీలు, 73శాతం ఎస్సీలు రెండు గదుల కన్నా తక్కువ ఉన్న ఇండ్లలో ఉంటున్నారని వివరించారు. 13.3 శాతం కుటుంబాలకు ఇంట్లో మరుగుదొడ్ల సౌకర్యం లేవన్నారు. కాంపోసిట్‌ బ్యాక్‌వర్డ్‌నెస్‌ ఇండిక్స్‌ (సీబీఐ) ఆధారంగా పకడ్బందిగా సర్వే చేసినట్టు తెలిపారు. ఈ సర్వే ప్రకారం ఆయా కులాలు తమతమ వెనకబాటు తనం, అభివృధ్దిని అంచనా వేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలను పొందేందుకు ఈ సర్వే ప్రామాణికంగా ఉపయోగపడుతుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -