Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి

ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీపీలుగా పదోన్నతి

- Advertisement -

ప్రస్తుత పోస్టింగ్‌లలోనే కొనసాగింపు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్రానికి చెందిన ఆరుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)లు గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1995 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మహేశ్‌ భగవత్‌, స్వాతి లక్రా, వి.వి శ్రీనివాస్‌రావు, 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన చారుసిన్హా, వీ.సీ సజ్జనార్‌, అనిల్‌ కుమార్‌లకు డీజీపీలుగా పదోన్నతులు లభించాయి. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీగా మహేశ్‌ భగవత్‌, రాష్ట్ర హౌంగార్డ్‌ విభాగం అదనపు డీజీగా స్వాతి లక్రా, రాష్ట్ర పోలీస్‌ సాంకేతిక విభాగం అదనపు డీజీగా వి.వి శ్రీనివాస్‌రావు, రాష్ట్ర ఏసీబీ, సీఐడీ అదనపు డీజీగా చారుసిన్హా, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గా వీ.సీ సజ్జనార్‌, రాష్ట్ర గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ అదనపు డీజీగా అనిల్‌ కుమార్‌లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీజీపీలుగా పదోన్నతులు రావడంతో ఈ ఆరుగురు ఐపీఎస్‌ అధికారులను వారు ప్రస్తుతం నిర్వర్తిస్తున్న పోస్టుల్లోనే కొనసాగా ల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కాగా ప్రస్తుత రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో రాష్ట్ర నూతన డీజీపీగా రాష్ట్ర హౌంశాఖ ముఖ్యకార్యదర్శి సీ.వీ ఆనంద్‌ లేదా రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్‌ సౌమ్యామిశ్రాలలో ఒకరిని కేంద్ర యూపీఎస్సీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈనేపథ్యంలో రాష్ట్ర నూతన డీజీపీ పోస్టింగ్‌తో పాటు మరికొందరు ఐజీలకు అదనపు డీజీలుగా పదోన్నతులు, నూతన పోస్టింగ్‌లను కూడా ఇవ్వడానికి సర్కారు కసరత్తు చేసినట్టు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -