నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి సింగరేణి ఏరియా జీఎం సరికొండ వెంకటాచారి ఆదేశాల మేరకు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా సింగరేణి సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, జేవీఆర్ సీహెచ్‌పీ ప్రాంగణాల్లో ఉద్యోగులకు మట్టి విగ్రహాలను ఆదివారం అందించారు. జేవీఆర్ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్వీఆర్ ప్రహ్లాద్ స్వయంగా పాల్గొని ఉద్యోగులకు విగ్రహాలు అందజేశారు.
కిష్టారం ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సునీల్ వర్మ, జేవీఆర్ సీహెచ్‌పీ ఎస్‌ఈ సాయినాథ్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులనే పూజించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో సింగరేణి సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్ డి. శ్రీనివాసరావు, ఎస్ఓఎం బెజ్జంకి రాజేశ్వరరావు, పర్యావరణ అధికారి సంతోష్ కుమార్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్, సింగరేణిలోని వివిధ విభాగాల అధికారులు, సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.



