Sunday, September 13, 2026
E-PAPER
Homeదర్వాజసాహితీ వార్తలు

సాహితీ వార్తలు

- Advertisement -

బీసీ కలాల అలాయిబలాయి
జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన 23 మంది బీసీ కవుల ఆత్మకథనాత్మక కవిత్వ సంకలనం ‘వెంటాడే కలాలు’ వెనుకబడిన కులాలు రజతోత్సవ సభ ఈ నెల 20న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. ‘

బాలచెలిమి’ జాతీయస్థాయి కథల పోటీ-2026
​విద్యార్థిని, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వారి రచనా ప్రతిభను ప్రోత్సహించేందుకు నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ‘కథల పోటీ–2026’ నిర్వహిస్తుoది. అక్టోబర్ 14వ తేదీలోపు [email protected]; వాట్సాప్: 86866 64949 రచనలను పంపాలి.

గరిపెల్లి అశోక్, కన్వీనర్,బాలచెలిమి
‘సోమేపల్లి’ పురస్కారాలకు చిన్న కథలకు ఆహ్వానం
​జాతీయస్థాయిలో 17వ సోమేపల్లి సాహితీ పురస్కారాల కోసం చిన్న కథలను ఆహ్వానిస్తోంది. డి.టి.పిలో 2 పేజీలలోపు వున్న కథలను అక్టోబర్ 30వ తేదీలోపు ‘రమ్యభారతి, పి.బి.నెం:5, 11-57/1-32 జె.ఆర్.కాంప్లెక్స్, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ-520001’ చిరునామాకు పంపాలి. వివరాలకు : 9247475975.
వశిష్ట సోమేపల్లి, అవార్డు కమిటీ; చలపాక ప్రకాష్, ఎడిటర్, రమ్యభారతి

పెన్నా సాహిత్య పురస్కారం 2026 కు బిల్ల మహేందర్ కవితా సంపుటి
పెన్నా సాహిత్య పురస్కారం 2026 కు గాను బిల్ల మహేందర్ కవితా సంపుటి ‘నేనుమరణిస్తూనే ఉన్నాను’ ఎన్నిక అయింది. త్వరలో నిర్వహించబోయే పెన్నా రచయితల సంఘం 17వ వార్షికోత్సవంలో బిల్ల మహేందర్కి నగదుపురస్కారం,సన్మానం జరుగుతుంది.
అవ్వారు శ్రీధర్ బాబు, గోవిందరాజు సుభద్ర దేవి, పెన్నా రచయితల సంఘం

గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కార ప్రదాన సభ
డా॥ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కార ప్రదాన సభ ఎం.వి.ఆర్. ఫౌండేషన్ నిర్వహణలో రచన సాహిత్య వేదిక (కడప), గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 20న సాయంత్రం 05-30 గం॥లకు హైదరాబాదు సుల్తాన్ బజార్(కోఠి)లోని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయంలో జరుగుతుంది. ఈ అవార్డుకు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘పంచవటి’ ఎంపికైంది. ఈ కార్యక్రమంలో విహారి, డా॥ రేవూరి అనంత పద్మనాభరావు, గుత్తికొండ సుబ్బారావు, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డా॥ ఏల్చూరి మురళీధరరావు, సుధామ, శ్రీమతి ధూళిపాళ అరుణ, ఎం.జానకిరామ్, గడియారం వేంకట శేషశర్మ పాల్గొంటారు.
డా॥ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, కార్యదర్శి, రచన సాహిత్య వేదిక, 9966624276

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -