సెన్సెక్స్ 757 పాయింట్ల క్షీణత
ముంబయి : వరుసగా మూడు రోజులు లాభాల్లో సాగిన భారత మార్కెట్లలో మళ్లీ యుద్ధ భయాలు చోటు చేసుకున్నాయి. దీంతో బుధవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాలను చవి చూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 757 పాయింట్లు లేదా 0.95 శాతం పతనంతో 78,516కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 198 పాయింట్లు లేదా 0.81 శాతం నష్టంతో 24,378.10 వద్ద ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం వరుసగా 0.19 శాతం, 1.13 శాతం చొప్పున లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ మార్కెట్లను కలవరపెట్టింది. ఇరాన్ ప్రభుత్వం ఏకాభిప్రాయానికి వచ్చే వరకు యుద్ధ విరామాన్ని పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే.. హార్ముజ్ జలసంధి వద్ద దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేయడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరగాల్సిన సమావేశానికి టెహ్రాన్ విముఖత చూపడంతో చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ అనిశ్చితి ప్రభావం మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది, ముఖ్యంగా ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో రంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
మార్కెట్లలో మళ్లీ యుద్ధ భయాలు
- Advertisement -
- Advertisement -



