ఏఅండ్‌టీ పవర్ సిస్టమ్స్‌తో జట్టు
నవ తెలంగాణ – హైదరాబాద్
టాటా పవర్ తన వినూత్నమైన ‘ఇజడ్ హోమ్’ ఆటోమేషన్ సొల్యూషన్స్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక పట్టణ జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన ఈ స్మార్ట్ హోమ్ సాంకేతికత, యాప్ ఆధారిత నియంత్రణ ద్వారా ఇంటిలోని లైటింగ్, ఏసీ, ఫ్రిజ్ వంటి ఉపకరణాలను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే స్మార్ట్ సాకెట్లు, టచ్ ప్యానెల్స్, మోషన్ సెన్సార్లను సులభంగా అమర్చుకోవచ్చని టాటా పవర్ గ్రూప్ క్యాపిటవ్ అండ్ ఎంటర్ప్రైజ్ అకౌంట్స్ నేషనల్ హెడ్ కౌషిక్ సన్యల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నెట్ లేని సమయంలో కూడా ఈ వ్యవస్థ ఆఫ్‌లైన్‌లో నిరాటంకముగా పనిచేస్తూ.. వోల్టేజీ హెచ్చుతగ్గుల నుంచి ఇంటి ఉపకరణాలకు పూర్తి భద్రతను అందిస్తుందన్నారు. ఇజడ్ హౌమ్ 100 నగరాల విస్తరణలో భాగంగా హైదరాబాద్ 11వది అన్నారు. త్వరలోనే తెలంగాణలోని 33 జిల్లాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏఅండ్‌టీ పవర్ సిస్టమ్స్ డైరెక్టర్స్ అనిల్ కుమార్ పర్చా, ఎస్ తిరుమలేష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ ఆటోమేషన్ వ్యవస్థ ద్వారా ఒక సాధారణ కుటుంబం ఏటా సుమారు 15 శాతం వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చన్నారు.
హైదరాబాద్ మార్కెట్లోకి టాటా పవర్ ఇజడ్ హౌమ్ సొల్యూషన్స్
- Advertisement -
- Advertisement -



