నవ తెలంగాణ – హైదరాబాద్
హైటెక్ సిటీలో రెడ్‌వుడ్ సాఫ్ట్వేర్ తన నూతన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను బుధవారం ప్రారంభించింది. అటానమస్ ఎంటర్ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏజెంటిక్ ఎఐ ఆవిష్కరణలు, అంతర్జాతీయ ఉత్పాదక అభివృద్ధిలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని, ఇక్కడి ప్రతిభావంతులైన యువత కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని రెడ్‌వుడ్ సీఈఓ కెవిన్ గ్రీనె తెలిపారు. బుధవారం ఇక్కడ ఆయన రెడ్‌వుడ్ ఇండియా కంట్రీ హెడ్ రాజ్‌కుమార్ పాల్‌రాజ్, ఫౌండింగ్ సీఈఓ ఫణి నాగార్జునతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ విస్తరణలో భాగంగా రెడ్‌వుడ్ సాఫ్ట్వేర్ భారీ ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టిందని కెవిన్ తెలిపారు. ప్రస్తుతం 100 మంది ఉద్యోగులున్నారని.. 2027 చివరి నాటికి ఇంజనీరింగ్, క్లౌడ్. బిజినెస్ ఆపరేషన్స్ వంటి విభాగాల్లో సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇది కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు మూడో వంతు కావడం విశేషం.
హైదరాబాద్‌లో ‘రెడ్‌వుడ్’ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -


