Monday, September 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలులక్ష్మీదేవమ్మ సేవలు ఎనలేనివి

లక్ష్మీదేవమ్మ సేవలు ఎనలేనివి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు

నవతెలంగాణ వనపర్తి

ఉమ్మడి మహబూబ్ నగర్ పార్టీ జిల్లా నాయకురాలుగా, మహిళా సంఘం నాయకురాలుగా ఎన్ఎస్ లక్ష్మీదేవమ్మ ఎనలేని సేవలు అందించారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ లు అన్నారు. సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఎస్.లక్ష్మీదేవమ్మ రెండవ వర్ధంతి ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పుట్ట ఆంజనేయులు, ఎండి జబ్బార్, నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ 1987లో వచ్చిన కరువులో అంబలి కేంద్రాలు ఏర్పాటుకు హితోదికంగా లక్ష్మీదేవమ్మ సహకరించారని తెలిపారు. లక్ష్మీ దేవమ్మ రాష్ట్ర కమిటీకి విరాళాలు అందించేవారని, పార్టీ అభివృద్ధికి అనేక సేవలు చేసిందన్నారు. రాత్రింబవళ్లు గ్రామ గ్రామం తిరిగి మహిళా సంఘాల నిర్మాణం చేసిందన్నారు. మహిళలపై జరిగిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా మహిళలను కూడగట్టి ఉద్యమించిందని వివరించారు. పార్టీ సమరశీల పోరాటాల్లో ముందున్నదని ఎన్ఎస్ లక్ష్మీ దేవమ్మ భౌతికకాయాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అందించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎం.రాజు, ఏ. లక్ష్మి, వనపర్తి పట్టణ నాయకులు డి.కురుమయ్య, నందిమల్ల రాములు, ఎం మన్యం, జి.బాలస్వామి, రమేష్, రాబర్ట్, బాల పేరు, గంధం గట్టయ్య, జి శ్రీనివాసులు, బీసన్న, జిల్లా ఆఫీస్ కార్యదర్శి ఉమా, సుగుణమ్మ, ఘట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -