- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో పల్లె దావాఖానా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు గురించి ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్.. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కలిసి విన్నవించినట్లు తెలిపారు. తమ విన్నపంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ అశోక్ పటేల్ విలేకరులకు తెలిపారు. సర్పంచ్ వెంట ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సురేష్ జుబ్రి ఆయనతో పాటు యువ నాయకులు ఉన్నారు.
- Advertisement -



