Monday, September 14, 2026
E-PAPER
Homeజిల్లాలుతిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి

- Advertisement -

కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం 
నవతెలంగాణ-వనపర్తి  

కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన వెంట సతీమణి శారద రెడ్డి, కుమారుడు నవనీత్ రెడ్డి ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుని, రాష్ట్ర ప్రజల సంక్షేమం, సుభిక్షం కోసం స్వామివారిని పూజించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి కుటుంబంలో అభివృద్ధి, సంతోషం వెల్లివిరియాలని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తన బాధ్యతలను మరింత అంకితభావంతో నిర్వర్తించేందుకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -