అత్యంత భక్తిశ్రద్ధలతో పట్టణ మహా గణపతి పూజ..
నవతెలంగాణ-వనపర్తి
వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా కొలువుదీరిన ప్రథమ పూజిత మహా గణపతి పూజలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విఘ్నాలు తొలిగించే విఘ్నేశ్వరుడు కలియుగములో ప్రథమ పూజితుడిగా ప్రసద్దికెక్కినారని అటువంటి గణపతి అశీషులతో ప్రజలలో భక్తిశ్రద్ధలు, ఐకమత్యం విలసిల్లాలని బాలగంగాధర్ తిలక్ వినాయక చవితికి శ్రీకారం చుట్టారు అని అన్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరుపుకొని అంతే భక్తిశ్రద్ధలతో నిమ్మజనం చేసుకోవాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పట్టణ మహా గణపతి కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ చీర్ల చందర్ బృందం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. పట్టణ మహాగణపతి కమిటీ సభ్యులు చీర్ల చందర్ బృందం ప్రతిష్టాత్మకంగా వినాయక చవితి పండుగ నిర్వహించి మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
లడ్డు గ్రహీతలకు సన్మానం
గత సంవత్సరం వేలం పాటలో లడ్డు దక్కించుకున్న జగదాంబ జ్యువెలరీ అధినేత సముదాన్ దంపతులను నిరంజన్ రెడ్డి సన్మానించి అభినందించారు. నిరంజన్ రెడ్డి వెంట వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, బీచుపల్లి యాదవ్, విష్ణు సాగర్, కౌన్సిలర్శ్ శ్రీకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, చిట్యాల రాము, తోట శ్రీను, మహా గణపతి కమిటీ సభ్యులు చీర్ల చందర్, కృష్ణ బాబు, గట్టు వెంకన్న, వెంకటేష్, కొమ్ము శ్రీనివాస్, వాకిటి నారాయణ తదితరులు ఉన్నారు.



