నవతెలంగాణ – అశ్వారావుపేట
వినాయక చవితి సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హైదరాబాద్ నుంచి తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంలోని తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అశ్వారావుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్‌పర్సన్ రమేష్‌బాబు దంపతులు ఆరో వార్డులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజల్లో పాల్గొన్నారు.
73 విగ్రహాల ఏర్పాటు: అశ్వారావుపేట మండలంలో మొత్తం 73 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు. నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు.


