Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సికింద్రాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ నియామకాలు 

సికింద్రాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ నియామకాలు 

- Advertisement -

– యువతకు అవకాశం
నవతెలంగాణ-హైద్రాబాద్ 

సికింద్రాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకొచ్చింది. కండక్టర్, డ్రైవర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులను డిపో స్థాయిలోనే నియమించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల సంస్థలో సిబ్బంది కొరతను తీర్చేందుకు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ పద్ధతుల్లో నియామకాలు చేపడుతున్నట్లు సమాచారం. 

పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
కండక్టర్లు రోజుకు రూ.800 వేతనం ఇవ్వనున్నారు. కనీస అర్హతగా ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ మెమో మరియు ఆధార్ కార్డు సమర్పించాలి. డ్రైవర్లు రోజుకు రూ.1500 వేతనం చెల్లించనున్నారు. కనీసం 18 నెలలపాటు చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఆధార్ కార్డు సమర్పించాలి. ఆసక్తి గల అభ్యర్థులు సమీప డిపో మేనేజర్‌ను ప్రత్యక్షంగా సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంప్రదించవలసిన స్థలం: కుషాయిగూడ డిపో మేనేజర్ కార్యాలయం ఫోన్ నంబర్లు: 9959226145, 9493210071 పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, కొత్త బస్సుల ప్రవేశంతో సిబ్బంది అవసరం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిసింది.  ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -