నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలో మరియు మహ్మదాబాద్,లాడేగావ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీ కాంతారావు గురువారం పాల్గొని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకి శాలువా కప్పి సత్కరించిన ఎమ్మెల్యే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లో విస్తారంగా నిబంధన ప్రకారం గృహాలు లేని నిరు పేదవారికి గృహాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. అర్హులను గుర్తించి వారికి అందరికీ న్యాయం జరిగే విధంగా గృహ నిర్మాణాల కొరకు మంజూరు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పలు గ్రామాలకు సర్పంచులు మరియు జిపి కార్యవర్గ సభ్యులు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



