- Advertisement -
- జాతీయ రహదారిపై భద్రతా చర్యలు
– స్పీడ్ బ్రేకర్లకు తెల్లని పెయింట్ - నవతెలంగాణ – ఉప్పునుంతల
- జాతీయ రహదారిపై ఎస్‌ఎస్‌ఆర్ కాంట్రాక్ట్ రోడ్డు పనుల భాగంగా ప్రయాణికుల రవాణా సౌకర్యంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం స్పీడ్ బ్రేకర్లపై తెల్లని పెయింట్ వేసి, అవి దూరం నుంచే ప్రయాణికుల కంటికి స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ చర్యల ద్వారా ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
సైడ్ ఇంచార్జ్ రవికుమార్ రెడ్డి నేతృత్వంలో కార్మికుల సహకారంతో ఈ పనులు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈ చర్యలు వాహనదారులకు భద్రతను కల్పించడంతో పాటు రహదారిపై సాఫీగా రాకపోకలు సాగేందుకు దోహదపడతాయని ఆయన నవ తెలంగాణతో పేర్కొన్నారు.
- Advertisement -



