- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని పెద్దతడుగూరులో డిప్యూటీ తహశీల్దార్ మహ్మద్ ఖలీద్, సర్పంచ్ శాంతవ్వ ఈరన్నలు లబ్దిదారులకు స్మార్ట్రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, పంచాయతీ పాలకవర్గం పంచాయతీ గ్రామ కార్యదర్శి నర్సింలు, జిపిఓ బాలనర్సు, రేషన్ డీలర్ సత్యవ్వ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని చెప్పారు.
- Advertisement -



