Thursday, April 23, 2026
E-PAPER
Homeఖమ్మంప్రధానోపాధ్యాయుల సమన్వయంలో ప్రతిభ

ప్రధానోపాధ్యాయుల సమన్వయంలో ప్రతిభ

- Advertisement -

– జిల్లా స్థాయిలో ప్రశంసలు అందుకున్న కాంప్లెక్స్ హెచ్‌ఎం వీరేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని గుమ్మడివల్లి కాంప్లెక్స్ హెచ్‌ఎం గుమ్మడివల్లి వీరేశ్వరరావు ఉపాధ్యాయులను సమన్వయపరచడంలో, విద్యా ప్రమాణాలను పెంపొందించడంలో తన ప్రత్యేక ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన విద్యాశాఖ వార్షిక సమీక్ష సమావేశంలో ఆయనకు ప్రశంసలు లభించాయి. గుమ్మడివల్లి కాంప్లెక్స్ పరిధిలో మొత్తం ఎనిమిది పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12 మంది ఉపాధ్యాయులు, సుమారు 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలల నిర్వహణలో వీరేశ్వరరావు సమర్థతతో ముందుకు సాగుతున్నారు.

ఉపాధ్యాయుల హాజరు, పనితీరు పర్యవేక్షణ, జీత బిల్లులు, సెలవుల మంజూరు వంటి పరిపాలనా అంశాలను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా పాఠశాలలను సందర్శిస్తూ, రిజిస్టర్లు పరిశీలించడం, విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షించడం, వెనుకబడిన విద్యార్థుల అభివృద్ధికి ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం ఇవ్వడం చేస్తున్నారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని స్వయంగా పరిశీలిస్తూ, ఆహార నాణ్యతపై దృష్టి సారించడం, వంట సిబ్బందికి అవసరమైన సూచనలు ఇవ్వడం కూడా ఆయన ప్రత్యేకత. అదేవిధంగా నెలవారీ బిల్లులు, జీతాల ప్రక్రియలను ఆన్లైన్‌లో సమర్థంగా నిర్వహిస్తున్నారు.

ప్రతి నెల కాంప్లెక్స్ స్థాయి సమావేశాలు నిర్వహించి, విద్యా రంగంలో నూతన మార్పులు, బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులతో చర్చలు జరిపి, సమావేశ నిర్ణయాలను నమోదు చేసి జిల్లా విద్యాశాఖ అధికారులకు సమర్పిస్తున్నారు. మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)తో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ, అవసరమైన సలహాలు తీసుకుంటున్నారు. సీఆర్పీ ల సహకారంతో అన్ని కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నారు.

అదేవిధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్, విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగే సమీక్ష సమావేశాలకు హాజరై నివేదికలు సమర్పిస్తూ, సమీక్షల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పాఠశాలలకు వచ్చే గ్రాంట్ల వినియోగాన్ని పర్యవేక్షించి, సక్రమంగా ఖర్చు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి విద్యార్థి సమయపాలన పాటించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం ద్వారా గుమ్మడివల్లి కాంప్లెక్స్‌ను ఆదర్శంగా నిలుపుతున్నారు. ఈ విధంగా సమన్వయం, నియంత్రణ, పర్యవేక్షణలో తన ప్రతిభను చాటుకుంటూ, జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు గుమ్మడివల్లి హెచ్‌ఎం వీరేశ్వరరావు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -