Friday, April 24, 2026
E-PAPER
Homeక్రైమ్జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడి…

జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడి…

- Advertisement -

– సూర్యాపేట జిల్లాలో దారుణం.!
నవతెలంగాణ – సూర్యాపేట: మోత మండలం రాఘవాపురం గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఫ్లోరైడ్ బాధితుల కోసం, సాగునీటి కోసం, రైతుల హక్కుల కోసం, ఎన్నో ఏళ్లుగా పోరాడిన ప్రజా ఉద్యమకారుడు పై దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తన భూమిని అడవిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికిన వ్యక్తిపై ఈ దాడి చేయడం అమానుషమని స్థానికులు అంటున్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మోతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -