- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో మాయమాటలు చెప్పి బాలికను లైంగికంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 52 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి లైంగికదాడి చేసినట్లు సమాచారం. బాలిక పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. గ్రామ పెద్దల సమక్షంలో నిందితుడు బాలిక తండ్రి కాళ్లు మొక్కాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



