ఓయూ ఇంటర్‌కాలేజ్ స్విమ్మింగ్ పోటీలు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ ఇంటర్ కాలేజ్ స్విమ్మింగ్ పోటీల్లో కె. మనీశ్ గౌడ్ (సెయింట్ జొసెఫ్ కాలేజ్) సత్తా చాటాడు. మెన్స్ 100 మీటర్ల, 200మీటర్ల బ్రెస్ట్ స్ర్టోక్ విభాగంలో పసిడి పతకం సాధించాడు. 50మీటర్ల బ్రెస్ట్ స్ర్టోక్‌లో రజత పతకం నెగ్గాడు. బద్రుకా కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు అంబర్‌పేట్ స్విమ్మింగ్‌పూల్‌లో జరుగగా.. ఎన్‌జిఐటి, ఎసీఎంఈ, కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచాయి. ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రొ.సునీల్ కుమార్, ఐయూటీ సెక్రటరీ ప్రొ. దీప్ల, బద్రుకా కాలేజ్ ప్రిన్సిపాల్ మోహన్ కుమార్‌లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
స్విమ్మింగ్‌లో మెరిసిన మనీశ్ గౌడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



