Thursday, September 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్పీసర శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

పీసర శ్రీనివాస్ గౌడ్‌కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
ముథోల్ మండలం లోని చించాల గ్రామానికి చెందిన సాహితీవేత్త, కవి, రచయిత, జర్నలిస్ట్ పీసర శ్రీనివాస్ గౌడ్‌కు ప్రతిష్ఠాత్మకమైన అష్టావధాన బంధువు పురస్కారం లభించింది. శ్రీ హంసవాహిని సాహిత్య కళా పీఠం ఆధ్వర్యంలో వాట్సాప్ వేదికగా నిర్వహించిన లఘు అష్టావధానంలో పాల్గొని విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ముధోల్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కవి శ్రీనివాస్ గౌడ్ మునుముందు సమాజ హితం కోసం మరెన్నో కవితలు రాసి మరిన్ని పురస్కారాలు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవకుమార్, ఎంపీవో శివకుమార్, సూపర్ డెంట్ ప్రవీణ్ రెడ్డి, ఏపీవో శిరీషా రెడ్డి, కార్యాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -