నవతెలంగాణ-అచ్చంపేట
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సైదులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ..1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేశారు. అందుకు గుర్తుగా ఈ రోజును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో జరిగిన ఆపరేషన్ అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం పోరాడిన ఉద్యమకారులు, యోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సెప్టెంబర్ 17కు విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం, ప్రజా పాలన దినోత్సవం వంటి భిన్న పేర్లు వాడుకలో ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం 2024 నుంచి ఈ రోజును అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహశీల్దార్ భీష్వ, ఎన్నికల నాయబ్ తహశీల్దార్ పట్టాభి, మండల గిర్ధావర్ శివకుమార్, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు, జిపిఓలు తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



