Thursday, September 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన వేడుకలు

భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా ప్రజా పాలన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-భీంగల్ :తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి చంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు అంజుమ్ అలీ, సందీప్, సంగ్య నాయక్, ప్రజాప్రతినిధులు అనంతరావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా పాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -