నవతెలంగాణ-నవాబ్‌పేట
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సురేష్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయరాం నాయక్, పోలీసు స్టేషన్లో ఎస్ఐ నరెందర్, ఎంఆర్సి భవనంలో ఎంఈఓ నాగ్య నాయక్, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ ఐకేపీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు, కస్తూరిబా పాఠశాల, కళాశాలలో స్పెషల్ ఆఫీసర్ మాధవి, గ్రంథాలయంలో ఉప సర్పంచ్ హజహర్ అలీ మార్కెట్ యార్డులో చైర్మన్ హరలింగం ముదిరాజ్ లతో పాటు వివిధ గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయంలో, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరణ చేసారు.
కార్యాలయాల ప్రాంగణంలో జాతీయ గీతాన్ని ఆలపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వంటి అంశాల ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఎంపీడీవో కార్యాలయ అధికారులు ,సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.



