Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలురెట్రో స్టయిల్‌లో ‘వెవెలా..’ పాట

రెట్రో స్టయిల్‌లో ‘వెవెలా..’ పాట

- Advertisement -

అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకుడు. అక్టోబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ను రిలీజ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాట‌ను విడుద‌ల చేసి, మేకర్స్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ సాంగ్ నేప‌థ్యం విష‌యానికి వ‌స్తే..త‌మ‌కు కావాల్సిన ఓ అరుదైన బాక్స్ కోసం విల‌న్ గ్యాంగ్ వెతుకుతుంటుంది. అది హీరో, హీరోయిన్ ద‌గ్గ‌ర ఉంద‌ని వారు భావిస్తుం టారు. అదే స‌మ‌యంలో వాళ్లు విల‌న్స్ కంట‌ ప‌డ‌తారు. మ‌రోవైపు హీరో చేతిలో గ‌న్ ఉంటుంది. అది ఊహించ‌ని రీతిలో పేలుతుంది. దీంతో హీరో హీరోయిన్‌ల‌పై గ్యాంగ్ రివ‌ర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ నేప‌థ్యంలో రెట్రో స్టైల్లో ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ సాంగ్ ప్లే అవుతుంటుంది. ఎల‌క్ట్రానిక్ కిలి, ఆర్కాడో సంగీత సార‌థ్యంలో ఈ సాంగ్‌ను కిట్టు విస్సాప్ర‌గ‌డ రాయ‌గా..శ్రీ సాగ‌ర్ పాడారు. పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా డిఫ‌రెంట్ బ్యాక్ డ్రాప్‌, మ్యూజిక్‌తో ఆసాంతం ఆక‌ట్టుకుంటోంది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ వేణు దోనేపూడి మాట్లాడుతూ, ‘ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన మూవీ టీజ‌ర్‌, అజా మేరీ జాని సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు ‘వెవెలా ఊహ‌లే చూపినా..’ అనే సాంగ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. డిఫ‌రెంట్ స్టైల్లో సాగే పాట ఇది. ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన మా అనిల్ రావిపూడికి థాంక్స్‌. సినిమాను అక్టోబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. మేఘాల‌యాలోనే పూర్తి సినిమాను కంప్లీట్ చేశాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -