హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో నాని మాట్లాడుతూ,‘ప్రేక్షకులు థియేటర్ లో మంచి మాస్ ఫిలిమ్‌ని చూడాలనుకుంటారు. అలాంటి గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈనెల 24న చూస్తారు. మేము ఒక మంచి కథని చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో, గొప్ప మూమెంట్స్‌తో తీశాము. నేను కమల్ హాసన్, భాగ్యరాజా, భారతీరాజా సినిమాలు చూస్తూ పెరిగాను. చెన్నై ఎప్పుడు వచ్చినా సరే ఒక ఇంటికి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు నన్ను ఎంతో చక్కగా ఆదరించారు. ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే అంత కాన్ఫిడెంట్‌గా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాను. నా గత సినిమాలకు ఇక్కడ అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు. తమిళ ఆడియన్స్ కు కృతజ్ఞతతో ఉంటాను. నా కెరీర్‌లో చేసిన చాలా హార్డ్ వర్కింగ్ సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. ఇప్పుడు అందరూ నన్ను నాని అని పిలుస్తారు. మళ్లీ ఇక్కడికి ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు మీరు తప్పకుండా జడల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సినిమాని తమిళ్‌లో రిలీజ్ చేస్తున్న స్వరూప్ కి థాంక్యూ. తప్పకుండా ఇది ఆయనకి చాలా మంచి జ్ఞాపకం అవుతుంది. అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు. ‘ఇది రెవల్యూషనరీ ఫిలిమ్. మదర్ ఎమోషన్ కూడా ఉంటుంది. తప్పకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నాని ఒక రెబల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. తన ప్రాంతం కోసం, తన ప్రజల కోసం, తన ఉనికి కోసం, తన తల్లి కోసం ఎలా పోరాడారు అనేది ఈ సినిమా ప్రధాన అంశం’ అని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చెప్పారు.
అందరూ కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



