సందీప్ కిషన్ నటించిన తాజా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’. దర్శకుడిగా జేసన్ సంజయ్ డెబ్యూ చేస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా, ఎన్‌వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ,‘దర్శకుడు స్క్రిప్ట్ ఇచ్చి, తను ఏ కథ చెప్పాడో అదే తీశాడు. తను సినిమాని చాలా జెన్యూన్‌గా ప్రేమిస్తున్నాడు. చాలా జెన్యూన్ ఇంటెన్షన్ ఉంది. సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘ఇది నా ఫస్ట్ సినిమా. అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెం ట్స్ ఉన్నాయి. అడ్వెంచర్ ఉంటుంది. ఒక ట్రెజర్ హంట్ లాంటి సినిమా. అలాగే అందరూ ఎంజాయ్ చేసుకునేలా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సినిమా ఫన్ రైడ్‌లాగా ఉంటుంది. నాకు సందీప్ కిషన్ సినిమాల్లో ‘భైరవకోన’ చాలా ఇష్టం. అలాగే ఆయన ‘మైఖేల్’ సినిమా నేను తమిళ్‌లో చూశాను. అది చాలా బాగుంటుంది. ఈ సినిమాని మీరందరూ చూసి ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు’ అని దర్శకుడు జేసన్ సంజయ్ చెప్పారు.
ఊహించని రీతిలో ‘సిగ్మా’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



