Friday, September 18, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్‌‌కు బీబీఎల్‌ పోటీ కాదు

ఐపీఎల్‌‌కు బీబీఎల్‌ పోటీ కాదు

- Advertisement -

బిగ్‌‌బాష్‌ లీగ్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ ఫిల్‌ రిగ్బి
చెన్నై : బిగ్‌‌బాష్‌ ‌లీగ్‌ (బీబీఎల్‌) ఐపీఎల్‌‌తో పోటీపడేందుకు ఇక్కడికి రావటం లేదు. క్రికెట్‌‌తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు బిగ్‌‌బాష్‌ ‌లీగ్‌ ‌కల్చర్‌‌ను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నామని లీగ్‌ ఆపరేషన్స్‌‌ హెడ్‌ ‌ఫిల్‌ ‌రిగ్బి తెలిపారు. డిసెంబర్‌ 12న బీబీఎల్‌ ‌సీజన్‌ ఆరంభ మ్యాచ్‌ ‌చెన్నైలోని చెపాక్‌ ‌స్టేడియంలో జరుగనుంది. ఈ నేపథ్యంలో బీబీఎల్‌ ఉన్నతాధికారులతో పాటు ఆరంభ మ్యాచ్‌‌లో తలపడే గత సీజన్‌ ‌ఫైనలిస్ట్‌‌లు మెల్‌‌బోర్న్‌ ‌రెనెగెడ్స్‌, పెర్త్‌ ‌స్కార్చర్స్‌ ఆటగాళ్లు గురువారం చెపాక్‌‌లో మీడియాతో మాట్లాడారు. ‘భారత్‌, ఆస్ర్టేలియా ప్రభుత్వాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా క్రికెట్‌‌తో ఇరు దేశాలను మరింత చేరువ చేసేందుకు బిగ్‌‌బాష్‌ ‌లీగ్‌ ఆరంభ మ్యాచ్‌‌ను భారత్‌‌లో నిర్వహిస్తున్నాం. ఇది ఈ ఒక్క సీజన్‌‌తో ఆగిపోదు. భవిష్యత్‌‌లోనూ బీబీఎల్‌ ‌మ్యాచ్‌‌లను భారత్‌‌లో నిర్వహిస్తాం. బీసీసీఐ, తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ‌సహకారం బాగుంది. 2026 టీ20 ప్రపంచకప్‌‌కు అసోసియేట్‌ ‌దేశాల మ్యాచ్‌‌లకు సైతం చెపాక్‌‌లో అభిమానులు గణనీయంగా స్టేడియానికి వచ్చారు. అందుకే, బీబీఎల్‌ ‌మ్యాచ్‌‌కు చెపాక్‌‌ను వేదికగా ఎంచుకున్నామని’ ఫిల్‌ రిగ్బి తెలిపారు. పెర్త్‌ ‌స్కార్చర్స్‌ ఆటగాడు జై రిచర్డ్‌‌సన్‌, మెల్‌‌బోర్న్‌ ‌రెనెగడ్స్‌ ఆటగాడు బ్రెండన్‌ ‌డాగెట్‌‌లు బీబీఎల్‌ ‌ట్రోఫీతో చెపాక్‌ ‌స్టేడియంలో ఫోటోలకు ఫోజులిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -