Friday, September 18, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర సహాయమంత్రి సుదర్శన్‌ నాచియప్పన్‌ (78) గురువారం కన్నుమూశారు. వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో తమిళనాడులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శివగంగై నుంచి లోక్‌సభకు, అనంతరం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. సీనియర్‌ న్యాయవాదిగా, ఏఐసీసీ కార్యదర్శిగా సేవలందించారు. 2013-14లో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. నాచియప్పన్‌ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -