Friday, September 18, 2026
E-PAPER
Homeజాతీయం17 ఏండ్ల బాలికపై మైనర్ల లైంగికదాడి.. మృతదేహాన్ని పీక్కుతున్న కుక్కలు

17 ఏండ్ల బాలికపై మైనర్ల లైంగికదాడి.. మృతదేహాన్ని పీక్కుతున్న కుక్కలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలిక హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వరూప్‌నగర్‌లోని ఓ బహిరంగ ప్రదేశంలో సెప్టెంబర్‌ 13న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలికపై లైంగికదాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా 50కుపైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఓ టెంపోను గుర్తించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురి వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 16 నుంచి 17 ఏండ్ల వయసున్న ముగ్గురు మైనర్లతో పాటు శివమ్‌ అలియాస్‌ సుదామాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు కత్తులు, దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. బీఎన్‌ఎస్‌ సంబంధిత సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్‌ 6 కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -