Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత 

పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత 

- Advertisement -

మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ ఎంతో కృషి చేస్తుందని మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్ చెప్పారు. మండలంలోని బైరంపల్లి గ్రామానికి చెందిన గొడుగు హర్ష కిడ్నీ సమస్యతో  హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చులకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతుండడంతో మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్క లక్ష యాభై వేల రూపాయల ఎల్ఓసినీ  మంజూరు చేశారు. శుక్రవారం గ్రామస్తులతో కలిసి ఎల్ఓసిని కుటుంబ సభ్యులకు అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందిస్తున్నది ప్రజా ప్రభుత్వమని కొనియాడారు. కార్యక్రమంలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వర్, బీరయ్య, రవి, మల్లయ్య, బాలయ్య, ఐలు తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -