హీరో నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరు లో నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో నాని మాట్లాడుతూ, ‘బెంగళూరు ఎప్పుడు వచ్చినా సరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు ఎంతగానో ప్రేమ, ఆదరణ చూపిస్తారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా ప్రతిష్టాత్మక చిత్రం. నా కెరీర్లో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన సినిమా ఇదే. అలాగే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన సినిమా కూడా ఇదే. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతి అందించడానికి మేము ఎక్కడా రాజీ పడ కుండా వర్క్ చేశాం. తప్పకుండా మీరు బిగ్ స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది యాక్షన్ డ్రామా. ఈ జోనర్ లో చాలా సినిమాలు వచ్చి ఉండొచ్చు. కాకపోతే ‘ప్యారడైజ్’ లాంటి ఇంటెన్సిటీ, వరల్డ్ బిల్డింగ్, ఎనర్జీ, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇప్పటివరకు రాలేదు.
అలాగే అనిరుధ్ అద్భుతమైన స్కోర్ చేశారు. మోహన్ బాబు , సోనాలి కులకర్ణి, రాఘవ్.. ఇలా అందరూ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాళ్లందరితో కలిసి నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. ఇందులో ఉండే హై మూమెంట్స్ అన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఉండే ఎమోషన్ మీ అందరినీ కదిలిస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఒక స్పెక్టక్యులర్గా ఉంటాయి. ఇది ఒక తల్లి, కొడుకుల కథ. అది అన్నిటికంటే గొప్ప ఎమోషన్. చాలా మంచి కమర్షియల్ ఎక్స్పీరియన్స్ సినిమా అవుతుంది. ఈ సినిమా జడల్ లుక్ వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. జడలు కథలో భాగంగా ఉంటుంది. మీ అందరి రెస్పాన్స్ చూడడానికి ఎదురుచూస్తున్నాను. మదర్-సన్ ఎమోషన్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కాకపోతే ఇందులో ఉండే మదర్-సన్ కాన్ఫ్లిక్ట్ను మీరు ఎప్పుడూ చూసి ఉండరు’ అని తెలిపారు.
ఇప్పటివరకు రాలేదు
- Advertisement -
- Advertisement -



