బాధితునికి రూ.15 వేల ఆర్థిక సాయం : ఎంఏ ఖయ్యూం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన గోద గోవర్ధన్ ప్రమాదవశాత్తు గాయం అవడంతో రాజీవ్ స్మారక ట్రస్ట్ చౌటుప్పల్ కార్యదర్శి ఎంఏ ఖయ్యూం, ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్ల నరసింహ చేతుల మీదగా సోమవారం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో రూ.15వేల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఎంఏ ఖయ్యూం తెలిపారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య ఉప సర్పంచ్ గంగాపురం గంగాధర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చేవెళ్లి కృష్ణ, కుర్నాల వెంకటేష్, వనం రాజు, ఆకుల మధు, మైలారం రాములు, కుర్నాల రవీందర్, పల్చం పాపయ్య,ఎర్ర విక్రం గౌడ్, బాతరాజు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love