Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అజ్జలాపురంలో పోషణ మాసం కార్యక్రమం 

అజ్జలాపురంలో పోషణ మాసం కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని అజ్జలాపురం గ్రామంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ యశోద మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మొదటి 1000 రోజులు అత్యంత కీలకం అని అన్నారు.తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల గురించి తల్లులకు వివరించి పిల్లల పోషణ సంరక్షణలో తల్లిదండ్రులు మరియు సంరక్షకుల భాగస్వామ్యం ఉండాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ  రేవతి,అంగన్వాడి టీచర్లు శోభారాణి,జయమ్మ,హెల్త్ సూపర్వైజర్ అమృత,ఏఎన్ఎం ఛాయాలక్ష్మి,ఫైవ్ మీనా,తల్లులు చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -